డబ్బు ఎలా సేవ్ చేసుకోవాలి? | Money Saving Tips in Telugu | టాప్ 10 సేవింగ్స్ పద్ధతులు

offerz Wall

 డబ్బు ఎలా సేవ్ చేసుకోవాలి? ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే 10 సింపుల్ టిప్స్


డబ్బు ఎలా సేవ్ చేసుకోవాలి - Telugu Money Saving Tips


ఈ రోజుల్లో డబ్బును సేవ్ చేయడం ఎంత అవసరమో మన అందరికి తెలుసు. 

నెలాఖరుకు ఖర్చులు ఎక్కువ అవుతున్నప్పుడు , కొద్దిగా అయినా ఆదా చేయడం మన భవిష్యత్తు కోసం ఎంతో అవసరం. 


అందరు పాటించవలసిన 10 టిప్స్ 


1. ఆదాయం వచ్చిన వెంటనే సేవింగ్స్‌కు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి

పైనుండే “Save First, Spend Later” పద్ధతి ఉపయోగించండి. జీతం వచ్చిన వెంటనే 20-30% అమౌంట్ సేవింగ్స్ ఖాతాలో వేసేయండి.   


2. Daily ఖర్చులను నోట్స్‌లో రాసుకోవడం మొదలు పెట్టండి

రోజువారీ ఖర్చులు రాసుకుంటే, అసలు దేని మీద ఎక్కువగా ఖర్చవుతోందో అర్థమవుతుంది. ఇలా unnecessary ఖర్చులను తగ్గించవచ్చు.


3. క్రెడిట్ కార్డులు / BNPL జాగ్రత్తగా వాడండి

ఇప్పటి కాలంలో EMIల వాడకం ఎక్కువగా ఉంది. కానీ అవసరం లేనిదాన్ని కూడా  తీసుకోవడం భవిష్యత్తులో తలనొప్పికి కారణమవుతుంది.


4. ఒక Emergency Fund ఏర్పరచుకోండి

అవసరాల సమయంలో వాడడానికి మూడు నుండి ఆరు నెలల ఖర్చులను emergency fundగా పెట్టుకోండి.


5. బడ్జెట్ సిద్ధం చేసుకోవడం అలవాటు చేసుకోండి

మీ ఆదాయం, ఖర్చులను బట్టి  బడ్జెట్ ప్లాన్ సిద్ధం చేయడం వలన అదుపులో ఖర్చు చేయడం సులభమవుతుంది.


6. Cashbacks, Coupons మరియు Offers వాడండి

ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు cashback apps (PhonePe, Paytm, CRED) వాడడం వల్ల కొంత డబ్బు సేవ్ అవుతుంది.


7. వాణిజ్య వస్తువుల జాబితా సిద్ధం చేసి షాపింగ్ చేయండి

అనవసరంగా impulsive purchases కాకుండా, లిస్ట్ బట్టి షాపింగ్ చేయడం డబ్బు సేవ్ చేస్తుంది.


8. నిత్యావసరాలను పెద్ద ప్యాకెజ్‌లలో కొనండి

సమ్మర్/వింటర్ సేల్ సమయంలో గోధుమలు, బియ్యం, నూనె వంటివి bulk లో కొనడం ద్వారా కొన్ని రూపాయలు సేవ్ అవుతాయి.


9. Investing మొదలు పెట్టండి

సేవ్ చేసిన డబ్బును Gold FD, RD, SIP (Mutual Funds) లాంటి వాటిలో  పెట్టుబడి పెట్టడం ద్వారా చక్కటి returns పొందవచ్చు.


10. Subscription Services తగ్గించండి

OTT, Music, Gaming subscriptions ఎంత వాడుతున్నామో చూసి అవసరమైనవే ఉంచి మిగతావి cancel చేయండి.


📌 Final Words

డబ్బు సేవ్ చేయాలంటే పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న అలవాట్లతో కూడా చాలా మార్పు రావచ్చు. పై టిప్స్ మీకు ఉపయోగపడతాయనుకుంటున్నాం


Read More పిల్లల కోసం హెల్తీ లంచ్ బాక్స్ ఐటెమ్స్


Online Shopping Deals And Offers

To Top