రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs సన్‌రైజర్స్ హైదరాబాద్ – SRH ఘన విజయం! (IPL 2025 మ్యాచ్ రివ్యూ)

offerz Wall

 సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం 

Royal Challengers Bengaluru vs Sunrisers Hyderabad Highlights, IPL 2025

IPL 2025 సీజన్‌లో మే 23న లక్నోలోని ఏకానా స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు  మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో  సన్‌రైజర్స్ హైదరాబాద్ 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. 
ఈ మ్యాచ్ కి కెప్టెన్గా వ్యవహరించిన జితేష్ శర్మ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు

మొదటి ఇన్నింగ్స్ : 


సన్‌రైజర్స్ హైదరాబాద్  మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 231/6 పరుగులు చేసింది.

 టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్  అభిషేక్ శర్మ 17 బంతుల్లో 34 పరుగులు మంచి ప్రారంభం ఇచ్చాడు. ఇషాన్ కిషన్  48 బంతుల్లో 94 పరుగులతో తన కెరీర్‌లో బెస్ట్ ఇన్నింగ్స్ ఆడి అజేయంగా నిలిచాడు. ట్రావిస్ హెడ్ 10 బంతుల్లో 17 పరుగులు.హెన్రిచ్ క్లాసెన్ 13 బంతుల్లో 24 పరుగులు అనికేత్ వర్మ  9 బంతుల్లో 26 పరుగులు.నితీష్ కుమార్ రెడ్డి 7 బంతుల్లో 4 పరుగులు.అభినవ్ మనోహర్ 11 బంతుల్లో 12 పరుగులు పాట్ కమ్మిన్స్ 6 బంతుల్లో 13 పరుగులు.20 ఓవర్స్ పూర్తి అయ్యే  సమయానికి హైదరాబాద్ 231 పరుగులు చేసింది 6వికెట్ల నష్టానికి


రెండవ ఇన్నింగ్స్: 


RCB జట్టు 19.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్ అయింది. 

విరాట్ కోహ్లీ మరియు ఫిల్ సాల్ట్  నుంచి మంచి ప్రారంభం వచ్చిన  చివర్లో జట్టు 16 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. 


ఈ విజయం ద్వారా SRH, చిన్నస్వామి స్టేడియం బయట RCBని ఓడించిన మొదటి జట్టుగా రికార్డు నమోదు చేసింది. 
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నుంచి అత్యధిక స్కోరు చేసిన వ్యక్తిగా ఫీల్స్ నిలిచాడు 32బంతుల్లో 62 పరుగులు నమోదు చేశాడు
విరాట్ కోహ్లీ25 బంతుల్లో 43 పరుగులు చేశాడు
మయాంక్ అగర్వాల్ 10 బంతుల్లో 11 పరుగులు,
రజత్ పాటిదార్ 16 బంతుల్లో 18 పరుగులు ,జితేష్ శర్మ 15 బంతుల్లో 24 పరుగులు,రొమారియో షెపర్డ్ 1 బంతుల్లో 0 పరుగులు ,కృనాల్ పాండ్యా 6 బంతుల్లో 8 పరుగులు,టిమ్ డేవిడ్ 5 బంతుల్లో 1 పరుగులు, భువనేశ్వర్ కుమార్ 2 బంతుల్లో 3పరుగులు,
యష్ దయాళ్ 6 బంతుల్లో 3పరుగులు ,ఎంగిడి
2 బంతుల్లో 0 పరుగులు.

11 ఓవర్లకే స్కోరు 127కు చేరుకున్న రాయల్ చాలెంజర్స్ చివరి 4.3 ఓవర్లలో 16 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి 189 పరుగులకు ఆలౌట్ అయింది.సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 3 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు.

ఈ పరాజయంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకి ప్లేఆఫ్‌లో  2 స్థానంలో చేరే అవకాశాలను తగ్గించుకోవాల్సి వచ్చింది. వారికి ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది.


To Top